Thu Mar 26 2026 23:26:46 GMT+0530 (India Standard Time)
ఇంద్రకీలాద్రికి జనసేనాని
రాష్ట్రంలో నేటి నుంచి రాక్షసపాలన అంతం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు

రాష్ట్రంలో నేటి నుంచి రాక్షసపాలన అంతం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దుర్గగుడిలో వారాహికి పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దైవ సన్నిధిలో రాజకీయాలు మాట్లాడుకూడదన్న పవన్ కల్యాణ్ త్వరలోనే యాత్ర ఉంటుందని తెలిపారు. రాష్ట్రం అంతా సుఖంగా ఉండేందుకు వారాహి ప్రయత్నిస్తుందన్నారు. దుర్గగుడిని సందర్శించుకున్న పవన్ కల్యాణ్ అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పూలు సమర్పించుకున్నారు.
పవన్ ప్రత్యేక పూజలు...
పవ్న కల్యాణ్ కు దేవస్థానం ఈవో భ్రమరాంబ, పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయం ద్వారా అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ రాష్ట్రం సుభిక్షింగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. కొండపైకి వారాహి వాహనాన్ని అధికారులు అనుమతించలేదు. దీంతో ఇంద్రకీలాద్రి కింద వారాహికి పూజలు నిర్వహించిన అనంతరం పార్టీ నేతలతో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు.
- Tags
- pawan kalyan
Next Story

