Fri Jan 24 2025 16:50:24 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మరో అభ్యర్థిని ప్రకటించిన పవన్.. టీడీపీ కేటాయించిన సీటు నుంచి
పి. గన్నవరం జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు
పి. గన్నవరం జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. నిజానికి పి. గన్నవరం సీటును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అక్కడి నుంచి మహాసేన రాజేష్ పోటీ చేస్తారని కూడా జాబితాలో పేరును ప్రకటించారు. అయితే అక్కడ రాజేష్ పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లడి కావడంతో తెలుగుదేశం పార్టీ పునరాలోచనలో పడింది.
రెండు నెలల క్రితమే...
దీంతో పి.గన్నవరం సీటును జనసేనకు ఇవ్వాలని నిర్ణయించింది. కూటమి తరుపున జనసేన నుంచి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించడంతో పి. గన్నవరం వివాదానికి తెరపడినట్లయింది. గత కొంతకాలంగా మహాసేన రాజేష్ విషయంలో పునరాలోచన చేయాలని టీడీపీ అధినాయకత్వం ఐవీఆర్ఎస్ సర్వేను నిర్వహించి మరీ జనసేకు ఆ టిక్కెట్ అప్పగించింది. తెలంగాణలో పోలీస్ అధికారిగా గిడ్డి సత్యనారాయణ పనిచేశారు. ఆయన రెండు నెలల క్రితమే జనసేన పార్టీలో చేరారు.
Next Story