Thu Mar 19 2026 13:12:43 GMT+0530 (India Standard Time)
కేటీఆర్ సవాల్ ను స్వీకరించిన పవన్
మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఛాలెంజ్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వీకరించారు

మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఛాలెంజ్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వీకరించారు. చేనేత కార్మికులకు అండగా నిలబడాలని, చేనేత వస్త్రాలు ధరించాలని కోరారు. కేటీఆర్ ఛాలెంజ్ ను పవన్ కల్యాణ్ స్వీకరించారు. ఆయన మరో ముగ్గురికి ఛాలెంజ్ ను విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ లకు ఆయన ఛాలెంజ్ విసిరారు.
వారంలో ఒకరోజు...
నేతన్నల జీవితాలు బాగుపడాలంటే వారంలో ఒక రోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని కేటీఆర్ ప్రతి చేనేత దినోత్సవం నాడు పిలుపు నిస్తారు. అందులో భాగంగానే ఆయన పవన్ కల్యాణ్ కు ఛాలెంజ్ విసిరారు. దీనిని మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. వారి నుంచి రెస్పాన్స్ రావాల్సి ఉంది.
Next Story

