Sun Dec 08 2024 10:19:12 GMT+0000 (Coordinated Universal Time)
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు: పవన్ కళ్యాణ్
రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు.. మన పార్టీ
రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు.. మన పార్టీ కమ్యునిస్టులతో కలసినా, బీజేపీతో కలసినా, టీడీపీతో పొత్తు ఉన్నా అది రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. టీడీపీతో పొత్తు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. చర్చల్లో పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు జనసేనలో తావు లేదని తెలిపారు. ఎవరైనా ఒక నాయకుడు ప్రభుత్వ పాలసీలకు ఆటంకం కలిగించినప్పుడు అతని విధానాలు, చేసిన తప్పుల గురించి బలంగా చెప్పాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
అన్ని మతాలను ఒకేలా గౌరవించాలని, దేవాలయం, చర్చి, మసీదులపై దాడులు జరిగినప్పుడు ఒకేలా స్పందించాలి.. ముఖ్యంగా టీవీ చర్చలకు వెళ్లే వారు రాజకీయాలు, సమకాలీన అంశాలు, ప్రజా సమస్యలపై లోతుగా అధ్యయనం చేయాలన్నారు. అనవసర విషయాలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి హాని చేసే విధంగా చర్చలు ఉండకూడదన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఒక సమాచారాన్ని నిర్ధారించుకోకుండా మరొకరికి పంపడమో, దానిపై హడావిడి చేయకూడదని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Next Story