Sun Mar 08 2026 11:21:48 GMT+0530 (India Standard Time)
నేడు ఇప్పటం గ్రామానికి పవన్
ఈరోజు ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఇళ్లు కూల్చిన ఘటనలో బాధితులను ఆయన పరామర్శించనున్నారు.

ఈరోజు ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఇళ్లు కూల్చిన ఘటనలో బాధితులను ఆయన పరామర్శించనున్నారు. ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణ కోసమని చెప్పి అధికారులు కొన్ని కట్టడాలను కూల్చివేశారు. అయితే జనసేన సభకు వారి భూములు ఇచ్చినందుకే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇళ్ల కూల్చివేత కార్యక్రమాన్ని ప్రారంభించారని జనసేన ఆరోపిస్తుంది.
గ్రామస్థులకు భరోసా...
హైకోర్టును ఆశ్రయించి ఇళ్ల కూల్చివేతపై స్టే తెచ్చింది. తమకు అండగా నిలబడిన ఇప్పటం గ్రామస్థులను కలుసుకునేందుకు పవన్ కల్యాణ్ నేరుగా ఆ గ్రామానికి వెళ్లనున్నారు. గ్రామస్థులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. తాము అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పర్యటకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

