Sat Dec 06 2025 20:42:51 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రులపై జనసైనికుల దాడి హేయం
జనసేన కార్యకర్తలు ఏపీ మంత్రుల కార్లపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు

జనసేన కార్యకర్తలు ఏపీ మంత్రుల కార్లపై రాళ్ల దాడి చేశారు. విశాఖ గర్జనను ముగించుకుని ఎయిర్ పోర్టుకు వెళుతున్న మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేశారని చెబుతున్నారు. జనసేన కార్యకర్తలు జరిపిన దాడిలో తమ కార్ల అద్దాలు ధ్వంసం అవ్వడమే కాకుండా తమ వారికి కొందరికి గాయాలయ్యాయని మంత్రి జోగి రమేష్ తెలిపారు. జనసేనవి చిల్లర వేషాలు అన్నారు. పవన్ కల్యాణ్ ను హెచ్చరిస్తున్నానని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు.
తాము తలచుకుంటే...
జనసైనికులు కాదని, జనసైకోలు అని మంత్రులు ఫైర్ అయ్యారు. విశాఖలో గర్జనను పక్కదోవ పట్టించేందుకు ఈ విధమైన దాడికి దిగారని మంత్రులు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు. తమతో పెట్టుకుంటే పవన్ కల్యాణ్ ఈ రాష్ట్రంలో తిరగలేరని ఆయన హెచ్చరించారు. దీంతో విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంత్రుల కాన్వాయ్ పై దాడి చేసిన వారిని సీసీ కెమెరాలతో పోలీసులు గుర్తిస్తున్నారు.
Next Story

