Sat Mar 28 2026 09:37:41 GMT+0530 (India Standard Time)
నేడు పవన్ కల్యాణ్ దీక్ష
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు దీక్షకు దిగనున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో దీక్ష చేయనున్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు దీక్షకు దిగనున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో దీక్ష చేయనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పవన్ కల్యాణ్ దీక్ష చేయనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిలపక్షం ఏర్పాటు చేయాలని గతంలో పవన్ కల్యాణ్ అల్టిమేటం ఇచ్చారు. అయితే ఇంతవరకూ అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.
పీకే తో పాటు....
దీంతో పవన్ కల్యాణ్ ఈరోజు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగుతున్నారు. దీక్షకు కావాల్సిన ఏర్పాట్లను పార్టీ నేతలు చేశారు. దీక్షలో పవన్ కల్యాణ్ తో పాటు పీఏసీ సభ్యులు, జిల్లా పార్టీ నేతలు దీక్షలో పాల్గొననున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా నిలిచేందుకు ఈ దీక్షను పవన్ కల్యాణ్ చేపట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story

