Sat Mar 28 2026 04:55:37 GMT+0530 (India Standard Time)
వంచించడమే వైసీపీ నైజం.. పవన్ ఫైర్
నిరుద్యోగుల సమస్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జాబ్ క్యాలండర్ ను ఎక్కడ పెట్టారని ఆయన ప్రశ్నించారు.

నిరుద్యోగుల సమస్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జాబ్ క్యాలండర్ ను ఎక్కడ పెట్టారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ మరోసారి ఫైర్ అయ్యారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వద్ద కార్యాచరణ ఏమైనా ఉందా? అని పవన్ కల్యాణ్ నిలదీశారు. ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్ ద్వారా ఇప్పటి వరకూ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదని ఆయన ప్రశ్నించారు.
ఆందోళనకు దిగినా...
నిరుద్యోగ యువత ఆందోళన చేస్తున్నా వారిని అడ్డుకోవడం తప్పించి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధం కావడం లేదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ముప్ఫయి లక్షల మంది నిరుద్యోగులున్నారని, వారికి ఉపాధి కల్పించేందుకు ఎందుకు ప్రభుత్వం పూనుకోవడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అబద్దాలు చెబుతూ ప్రభుత్వం యువతను వంచిస్తుందన్నారు.
Next Story

