Sun Feb 01 2026 08:53:15 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. పవన్ సినిమాను తొక్కేయాల్సిన అవసరంఏంటని ఆమె ప్రశ్నించారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. పవన్ సినిమాను తొక్కేయాల్సిన అవసరం తమకేంటి అని ఆమె ప్రశ్నించారు. ఆయన ఏమైనా నిర్మాతా? లేదా డిస్ట్రిబ్యూటరా? పవన్ కు ఎందుకు నష్టం జరుగుతుందని రోజా నిలదీశారు. పుష్ప, అఖండ, బంగార్రాజు సినిమాలకు ఏ టిక్కెట్ ధరలు ఉన్నాయో ఇప్పుడూ అవే టిక్కెట్ ధరలు ఉన్నాయని చెప్పారు. అలాంటప్పుడు ఒక్క భీమ్లా నాయక్ కు మాత్రమే అన్యాయం ఎలా జరుగుతుందన్నారు.
వాయిదా వేసుకోవచ్చు కదా?
టిక్కెట్ ధరలపై నిర్ణయం వచ్చేంతవరకూ సినిమాను వాయిదా వేసుకోవాల్సిందని రోజా అన్నారు. లేదా రేట్లు పెంచుకోవాలనుకుంటే జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవచ్చని రోజా సూచించారు. మంత్రి గౌతమ్ రెడ్డి మరణం కారణంగానే టిక్కెట్ ధరలపై నిర్ణయంలో జాప్యం జరిగిందన్నారు. పవన్ కల్యాణ్ తన సినిమాను అడ్డం పెట్టుకుని పార్టీని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుందని రోజా అన్నారు.
Next Story

