Thu Mar 19 2026 00:49:17 GMT+0530 (India Standard Time)
నేతలకు పవన్ కల్యాణ్ ఆల్ ది బెస్ట్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని బలోపేతం చేసే చర్యలలో భాగంగా పవన్ కల్యాణ్ ఐదు జిల్లాలకు చెందిన మండలాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. సుదీర్ఘ కసరత్తు చేసిన అనంతరం పవన్ కల్యాణ్ ఈ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పార్టీ బలోపేతానికి.....
తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పార్టీ మండల అధ్యక్షుల నియామకాన్ని పవన్ కల్యాణ్ పూర్తి చేశారు. జిల్లా నేతల నుంచి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఈ నియామకాలను పవన్ చేపట్టారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా కోరారు. ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాలని కోరారు. అందరికీ పవన్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Next Story

