Tue Jan 20 2026 13:34:32 GMT+0000 (Coordinated Universal Time)
పార్టీ నేతలకు జనసేనాని సన్మానం
విశాఖలో అరెస్టయి జైలు పాలయిన జనసేన కార్యకర్తలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సన్మానించారు

విశాఖలో అరెస్టయి జైలు పాలయిన జనసేన కార్యకర్తలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సన్మానించారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ తో విడుదలయిన తొమ్మిది మంది జనసేన నాయకులను ఆత్మీయంగా పలకరించారు.
కుటుంబ సభ్యులతో...
వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. తొమ్మిది మంది కుటుంబ సభ్యులతో పవన్ కల్యాణ్ ముచ్చటించారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసులతో ఈ ప్రభుత్వం భయపెట్టాలని చూస్తుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పవన్ అన్నారు.
Next Story

