Fri Dec 05 2025 21:53:43 GMT+0000 (Coordinated Universal Time)
వారాహిని చూసి వైసీపీ భయపడుతోంది
వారాహి వాహనాన్ని చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు

వారాహి వాహనాన్ని చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నుంచి రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకే వారాహి వాహనాన్ని తీసుకొచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. వాహనం రంగులపై అనేక విమర్శలను వైసీపీ నేతలు చేస్తున్నారని, చట్ట ప్రకారమే నడుచుకునే పార్టీ జనసేన అని ఆయన అన్నారు.
జనవరి 12న యువశక్తి సదస్సు...
తమ పార్టీపై వైసీపీ నేతలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారని, అదే దృష్టి ప్రజా సమస్యలపై పెడితే అవి పరిష్కారమవుతాయని నాదెండ్ల అభిప్రాయపడ్డారు. జనవాణి ద్వారా ప్రజల నుంచి అందిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర ఈ వైసీపీ పాలనలో మరింత వెనక్కు పోయిందన్నారు. వలసలు ఎక్కువయ్యాయని ఆయన అన్నారు. వచ్చే ఏడాది జనవరి12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సదస్సును నిర్వహిస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Next Story

