Fri Dec 05 2025 13:18:52 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జనసేన శాసనసభ పక్షం కీలక సమావేశం
ఈరోజు జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది.

ఈరోజు జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. జనసేన శాసనసభ పక్ష సమావేశం నేడు జరగనుండటంతో అందరూ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి.
అసెంబ్లీ సమాశాల్లో...
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో బడ్జెట్ సమావేశాలు కావడంతో ఏ ఏ సబ్జెక్ట్ పై ఎవరు మాట్లాడాలన్న దానిపై పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో వివరణ ఇవ్వనున్నారు. జనసేన కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అవుతున్నార. బడ్జెట్ పై అవగాహనతో పాటు అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, బడ్జెట్ పై ఎలా చర్చించాలి అనే అంశాలపై పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నారు.
Next Story

