Fri Dec 05 2025 14:54:59 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : ఎమ్మెల్యేలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్... ఇలా అయితే కొ్త నేతలు వస్తారన్న జనసేనాని
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై అంతర్గత సర్వే చేయించినట్లు తెలిసింది.

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై అంతర్గత సర్వే చేయించినట్లు తెలిసింది. కొందరి ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోఫణలు రావడంతో ఈ సర్వేను నిర్వహించారు. విశాఖలో జరిగిన పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. వారి పనితీరును ఆయన వారి ముందుంచారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయిన తర్వాత జనసేన పార్టీ ఎమ్మెల్యేల పెర్ ఫార్మెన్స్ ను అంచనా వేశారు. గత కొంతకాలంగా జనసేన ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని విషయాల్లో అంటే మద్యం, ఇసుక వంటి విషయాల్లో తలదూర్చడంతో పాటు కొన్ని కాంట్రాక్టుట పనుల్లో ఎమ్మెల్యేలు చేతివాటం ప్రదర్శించడం వంటివి ఆయన దృష్టికి వచ్చాయి. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
క్యాడర్ తో కలసి ఉండాలని...
దీంతో విశాఖలో మూడు రోజుల పాటు జరగనున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో మొదటి రోజున ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమై నియోజకవర్గాల్లో జరుగుతన్న అభివృద్ధి పనులను గురించి, సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు జనసేన క్యాడర్ తో ఎమ్మెల్యల సంబంధాల గురించి కూడా పవన్ కల్యాణ్ ప్రశ్నించినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన ముఖ్య కార్యకర్తలు అసంతృప్తిగా ఉండటాన్ని గుర్తించిన పవన్ కల్యాణ్ వారిని దూరం చేసుకుంటే పార్టీతో పాటు వ్యక్తిగతంగా మీకే నష్టమని ముఖం మీదనే తేల్చి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు దూకుడు తగ్గించుకోవాలని హితవు పలికినట్లు సమాచారం.
ర్యాంకుల మేరకు...
మరొకవైపు తాను ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇస్తానని, ర్యాంకుల్లో దిగువ స్థాయి ఉన్న ఎమ్మెల్యేలు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలగాలని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సొంతం చేసుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని ఎమ్మెల్యేకు చెప్పినట్లు తెలిసింది. ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు కూటమి నేతలను కూడా కలుపుకుని పోవాలని, గ్రూపులను కట్టవద్దని కొద్దిగా కటువుగానే హెచ్చరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తాను ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తానని, ఆ సమయానికి ఎమ్మెల్యేలు సెట్ కావాలని, లేకుంటే ఇబ్బందులు పడతారని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.
Next Story

