Sat Mar 14 2026 19:51:08 GMT+0530 (India Standard Time)
Nagababu : వైసీపీపై నాగబాబు సంచలన కామెంట్స్
వైసీపీపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు.

వైసీపీపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు. తిరుపతి లడ్డూలో కెమికల్స్ కలిపిన దుర్మార్గపు పార్టీ వైసీపీ అని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కలసి ఉన్నంత వరకూ వైసీపీ గెలిచే అవకాశం లేదని, అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని నాగబాబు తెిపారు.
సింగిల్ డిజిట్ కే...
రప్పా రప్పా అన్నంత మాత్రాన అధికారంలోకి రాదని అన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తుందని నాగబాబు చెప్పారు. రప్పా రప్పా అనే నీచమైన రాజకీయ భాష మాట్లాడే వైసీపీకి ఈసారి ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితమవుతుందని హెచ్చరించారు.
Next Story

