Wed Mar 18 2026 13:05:40 GMT+0530 (India Standard Time)
Janasena : నేటి నుంచి జనసేన సభ్యత్వం ప్రారంభం
నేటి నుంచి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది.

నేటి నుంచి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. అన్ని నియోజకవర్గాల్లో సభ్యత నమోదును ప్రారంభించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని పదిరోజులపాటు సభ్యత్వ నమోదు నిర్వహించాలని కేంద్ర పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.
అన్ని నియోజకవర్గాల్లో...
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించిందని, ఇప్పటికే ఉన్న 6.47 లక్షల క్రియాశీలక సభ్యత్వాలను రెన్యువల్ చేయించాలని, జనసేనలో క్రియాశీలక సభ్యులకు రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Next Story

