Sun Mar 15 2026 05:36:18 GMT+0530 (India Standard Time)
Janasena : టిక్కెట్ రాకున్నా నేను పోటీ చేస్తా
పశ్చిమ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని జనసేన నేత పోతిన మహేష్ తెలిపారు

పశ్చిమ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని జనసేన నేత పోతిన మహేష్ తెలిపారు.విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ తనదేనని ఆయన తేల్చి చెప్పారు.ఎట్టి పరిస్థితులలో పశ్చిమ నియోజకవర్గం సీటు తనదే నంటూ ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
పవన్ ఫొటో పెట్టుకుని...
తనకు టికెట్ ఇవ్వని పక్షంలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని పోతిన మహేష్ తెలిపారు. బీజేపీ పోటీ చేయాలనుకుంటే సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని, హిందూ ధర్మాన్ని కాపాడేందుకు వెల్లంపల్లి శ్రీనివాస్ పై సెంట్రల్ నియోజకవర్గంలో బీజేపీ పోటీ చేయాలని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ తో సమావేశం అయినప్పుడు తాను ఈ విషయం చెప్పానని పోతిన మహేష్ తెలిపారు.
Next Story

