Sat Jul 27 2024 02:22:18 GMT+0000 (Coordinated Universal Time)
ఆ సీటు నాకు ఇవ్వాల్సిందే.. పవన్ కూడా మాట ఇచ్చారు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు తనకు ఇవ్వాలని జనసేన నేత పోతిన మహేష్ కోరారు.
![potina mahesh, jana sena, vijayawada west constituency, ticket potina mahesh, jana sena, vijayawada west constituency, ticket](https://www.telugupost.com/h-upload/2024/03/21/1601822-pothina-mahesh.webp)
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు తనకు ఇవ్వాలని జనసేన నేత పోతిన మహేష్ కోరారు. ఆయనకు పశ్చిమ సీటు కేటాయించాలని పోతిన మహేశ్ అనుచరులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం లో తాను లోకల్ అని ఆయన అన్నారు. కూటమి లో భాగంగా తనకే సీటు కేటాయించడం నాయ్యమన్నారు. గత ఐదేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడి పని చేశానని, తనతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కష్టపడ్డారన్ని అన్నారు.
ఐదేళ్ల నుంచి...
పశ్చిమ నియోజకవర్గం లో కొండ ప్రాంత అభివృద్ధి కి పాటుపడింది జనసేన పార్టీయే నని ఆయన అన్నారు. ఈ పశ్చిమ నియోజకవర్గం లో ఆణువణువూ తనకు తెలుసునన్న పోతిన మహేశ్, జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చిన వైస్సార్సీపీ తో పోటీ పడలేరని అన్నారు. ఇక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ను వేరే నియోజకవర్గం కి పంపించింది తమ పోరాటం వల్లనేనని అననారు. తనకు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉందని, పవన్ కళ్యాణ్ తనపేరు రెండో లిస్ట్ లో ఉంటుందని చెప్పారని, తనకు సీటు ఇవ్వడమే నాయ్యం అని అభిప్రాయపడ్డారు.
Next Story