Tue Jan 20 2026 15:15:00 GMT+0000 (Coordinated Universal Time)
జనసైనికులు సంయమనం పాటించండి : నాగబాబు
ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని జనసేన నేత నాగబాబు అన్నారు

ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని జనసేన నేత నాగబాబు అన్నారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఓటమి అంచుల్లో ఉందని, ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఎన్నికల కమిషన్ కు మనమందరం సహకరిద్దామని నాగబాబు పిలుపు నిచ్చారు.
కవ్వింపు చర్యలకు...
వైసీపీ కవ్వింపు చర్యలకు ఎవరూ ప్రతిస్పందించొద్దని నాగబాబు ఎక్స్ వేదికగా పిలుపు నిచ్చారు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దామని నాగబాబు పిలుపు నిచ్చారు.. కచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని Xలో నాగబాబు వీడియో రిలీజ్ చేశారు. దీంతో జనసైనికుల్లో నాగబాబు ట్వీట్ కు పెద్దయెత్తున రెస్పాన్స్ వస్తుంది
Next Story

