Sat Mar 07 2026 19:19:04 GMT+0530 (India Standard Time)
Nagababu : నాగబాబు పర్యటనకు కొణతాల దూరం.. రీజన్ ఇదే
జనసేన నేత నాగబాబు అనకాపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే ఆయన పర్యటనకు కొణతాల రామకృష్ణ దూరంగా ఉన్నారు

జనసేన నేత నాగబాబు అనకాపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే ఆయన పర్యటనకు కొణతాల రామకృష్ణ దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. నాగబాబు రానున్న ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతోనే కొణతాల నాగబాబు పర్యటనకు దూరంగా ఉన్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అనకాపల్లి నుంచి...
కొణతాల రామకృష్ణ ఇటీవల జనసేన పార్టీలో చేరారు. ఆయనకే అనకాపల్లి టిక్కెట్ దక్కడం ఖాయమని భావించారు. పవన్ కల్యాణ్ తో అనకాపల్లిలో పెద్ద బహిరంగ సభకు ప్లాన్ చేసినా అది వాయిదా పడింది. నాగబాబు పోటీ చేస్తున్నారని తెలియడంతోనే నేటి నాగబాబు పర్యటనకు కొణతాల దూరంగా ఉన్నారన్న టాక్ పార్టీలో ఉంది. దీనికి సమాధానం కొణతాల నుంచి రావాల్సి ఉంది.
Next Story

