Thu Dec 18 2025 17:51:12 GMT+0000 (Coordinated Universal Time)
మాచర్ల ఘటన దారుణం
ప్రజాస్వామ్యంలో రాజకీయ పరమైన కార్కక్రమాలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు

ప్రజాస్వామ్యంలో రాజకీయ పరమైన కార్కక్రమాలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మాచర్లలో జరిగిన ఘటనలను తమ పార్టీ ఖండిస్తుందని చెప్పారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష పార్టీ కార్యక్రమాలను అడ్డుకోవడం దారుణమన్నారు. వైసీపీ శాశ్వత అధికార లక్ష్యంతో ఈ దాడులకు పాల్పడుతుందని నాదెండ్ల ఆరోపించారు. ఘర్షన వాతావరణం సృష్టించడం, అల్లర్లు చేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, ప్రయివేటు ఆస్తులు, వ్యక్తులపై దాడి చేయడం సరికాదన్నారు.
రేపు 12 గంటలకే...
రేపు సత్తెనపల్లిలో రైతు భరోసా యాత్రను 12 గంటలకే ప్రారంభించనున్నామని తెలిపారు. రైతుల్లో భరోసా నింపేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పోలీసులు సహకరించాలని కోరారు. గుంటూరు జిల్లాలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. దాదాపు 280 కుటుంబాలకు చెక్కులను పంపీణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామల్లో రైతుల కుటుంబాలకు బెదరింపులయినట్లు తమకు సమాచారం అందిందని అన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిా విఫలమయిందని తెలిపారు.
Next Story

