Sun Mar 15 2026 21:33:32 GMT+0530 (India Standard Time)
తిరుమలలో స్వరూపానందేంద్ర స్వామి అక్రమ కట్టడాలు
తిరుమల లో మఠాల పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు

తిరుమల లో మఠాల పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో స్వరూపానందేంద్ర స్వామి అక్రమ కట్టడాలను బయటపెడతామని ఆయన తెలిపారు. స్వరూపానందేంద్ర స్వామి ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై జనసేన నేత కిరణ్ రాయల్ ద్వజమెత్తారు.
అన్నింటిపైనా విచారణ జరిపి...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల చేతుల్లో ఉన్న మఠాలను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని కిరణ్ రాయల్ తెలిపారు. తక్షణమే ఈవో దృష్టికి తీసుకువెళ్లి అక్రమ కట్టడాలను తొలగిస్తామని ఆయనతెలిపారు. తిరుమల కొండపై జరుగుతున్న అవినీతి అక్రమాలను టిడిపి, జనసేన అధ్యక్షులు దృష్టికి తీసుకువెళతామని కిరణ్ రాయల్ మీడియాకు తెలిపారు. ఆక్రమించిన నిర్మాణాలపై విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story

