Thu Dec 18 2025 07:38:10 GMT+0000 (Coordinated Universal Time)
వారాహి ఓనర్ ఈయనే
తెలంగాణలో జనసేన పవన్ కల్యాణ్ కు చెందిన వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పూర్తయింది.

తెలంగాణలో జనసేన పవన్ కల్యాణ్ కు చెందిన వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో పవన్ పర్యటనే మిగిలి ఉంది. అయితే ఈ వాహనం తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరిట రిజిస్ట్రేషన్ అయింది. ఈ వాహనానికి ఓనర్ ఆయనే. ఆయన టీ టైం కంపెనీ యజమాని. అయితే ఈ వాహనం పై ఎలాంటి వివాదం లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు.
పువ్వాడ ఏమన్నారంటే?
జనసేన వాహనం రంగు ఆలీవ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ అని ఆర్టీఏ అధికారులు నిర్ధారించారని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 9న టోలిచౌకి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలిపారు. ఈ వాహనానికి టీఎస్14ఈఎక్స్ 8384 నెంబరు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ వాహనానికి సంబంధించి రవాణా శాఖ అన్ని అనుమతులను మంజూరు చేసిందని తెలిపారు. అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆయన వివరించారు.
Next Story

