Thu Mar 19 2026 06:08:04 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : నేడు విశాఖకు పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన విశాఖకు రానున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన విశాఖకు రానున్నారు. సాయంత్రంత ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేయనన్నారు. విశాఖ జిల్లాకు చెందిన పదిహేను నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతలు, ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరు కావాలని ఆదేశాలు అందాయి.
నాగబాబు పోటీపై...
అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనిపై పవన్ కల్యాణ్ నేతలకు క్లారిటీ ఇచ్చే అవకాశముంది. పవన్ రెండు రోజుల పాటు విశాఖ జిల్లాలోనే పర్యటించనున్నారు. ప్రతి నియోజకవర్గం నేతలతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు వారికి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

