Sun Mar 22 2026 03:23:10 GMT+0530 (India Standard Time)
15న విశాఖకు పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 16వ తేదీన విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
మూడు రోజుల పాటు...
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో పవన్ కల్యాణ్ కు అందించే వీలు కల్పించారు. ప్రతి ఆదివారం జనవాణి కార్యక్రమం నిర్వహించే ప్రోగ్రామ్ లో భాగంగా ఈసారి విశాఖలో నిర్వహిస్తున్నారు. అలాగే మూడు రోజులు మూడు జిల్లాల పార్టీల జిల్లా నాయకులతో సమావేశమవుతారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story

