Fri Dec 05 2025 16:02:30 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : నేడు తెనాలికి పవన్ కల్యాణ్.. జగన్ పై దాడి ఘటనపై మాట్లాడతారా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తెనాలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తెనాలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు మద్దతుగా పవన్ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు తెనాలిలో జరగనున్న వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటి వరకూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై నిన్న జరిగిన రాళ్లదాడిపై పవన్ కల్యాణ్ ఇంత వరకూ స్పందించలేదు. దీనిపై ఈ సభలో ఎలా స్పందిస్తారోనన్నది ఆసక్తికరంగా మారింది.
సభ వేదికగా...
తెనాలి మార్కెట్ సెంటర్ పుర వేదిక వద్ద జరగనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. తెనాలికి పవన్ కల్యాణ్ వస్తుండటంతో పెద్దయెత్తున ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలి రానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నాదెండ్ల మనోహర్ దగ్గరుండి చూస్తున్నారు. ఈ సభలో టీడీపీ, బీజేపీ నేతలు కూడా పాల్గొననున్నారు. ఈ సభకు విజయభేరి అని నామకరణం చేశారు. పెద్దయెత్తున జనసమీకరణ చేసేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story

