Sun Mar 15 2026 10:21:40 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : నాలుగో రోజు పిఠాపురంలో పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు. ఆయన నాలుగో రోజు పిఠాపురంలో యాత్ర కొనసాగుతుంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు. ఆయన నాలుగో రోజు పిఠాపురంలో యాత్ర కొనసాగుతుంది. స్వల్ప జ్వరం, జలుబుతో బాధపడుతున్న పవన్ కల్యాణ్ నిన్న హైదరాబాద్ కు వెళ్లిపోయారు. ఈరోజు ఉదయం ఆయన తిరిగి పిఠాపురానికి చేరుకుని పార్టీ నిర్ణయించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
ప్రార్థనలు.. మహిళలతో ముఖాముఖి...
ఏబీసీ బాప్టిస్ట్ చర్చిని పవన్ కల్యాణ్ సందర్శించనున్నారు. బషీర్ బీబీ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు జరపనున్నారు. అనంతరం మూలాపేట జంక్షన్, అమీనాబాద్, ఉప్పాడ, కొత్తపల్లి జంక్షన్లలో మహిళలో ముఖాముఖిలో పవన్ పాల్గొననున్నారు. పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించి నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story

