Sun Mar 15 2026 14:59:16 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : నేడు పిఠాపురంలో పవన్ రోడ్ షో
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయన పిఠాపురంలో రోడ్ షోలో పాల్గొననున్నారు. పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి విమర్శకుల నోళ్లను మూయించాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమి పాలయిన పవన్ కల్యాణ్ ఈసారి మాత్రం ఒకేచోట పోటీకి దిగారు.
అత్యధిక ఓట్లతో...
పిఠాపురంలో అత్యధిక ఓట్లతో గెలవాలన్న ఆలోచనతో ఉన్నారు. తాను రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తునే మరోవైపు పిఠాపురంలో తరచూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన తరుపున పార్టీ నేతలు, సినీ తారలు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈరోజు పిఠాపురంలో జరిగే రోడ్ షోతో పాటు ఉప్పాడ సెంటర్ లో నిర్వహించే సభలో ఆయన పాల్గొంటారు.
Next Story

