Thu Jan 29 2026 01:24:12 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : నేడు కాకినాడలో పవన్ రోడ్ షో
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలో పర్యటించనున్నారు. రోడ్ షో నిర్వహించనున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో చివరి రోజున కాకినాడలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. బహిరంగ సభలో కూడా ప్రసంగించేందుకు జనసేనాని సిద్ధమవుతున్నారు. అయితే పోలీసులు సభకు ఇంతవరకూ అనుమతివ్వలేదు.
బహిరంగ సభ మాత్రం...
ఈరోజు వైసీపీ కూడా ర్యాలీకి అనుమతి కోరడంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని భావిస్తున్నారు. అందుకే అనుమతి వస్తే బహిరంగ సభ ఉంటుంది. లేకుంటే పవన్ కల్యాణ్ రోడ్ షోతో తన ప్రచారాన్ని ముగించనున్నారు. కాకినాడలో జనసేనాని రోడ్ షోకు మాత్రం ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Next Story

