Sun Mar 15 2026 13:42:20 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : నేడు పవన్ నామినేషన్ అట్టహాసంగా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పిఠాపురం నియోజకవర్గంలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పిఠాపురం నియోజకవర్గంలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈరోజు ఉదయం 9.30 గంటలకు భారీగా ర్యాలీగా వెళ్లి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందచేయనున్నారు. ఇందుకు సంబంధించిన పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లను పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే చేశారు.
భారీ ర్యాలీతో....
పవన్ కల్యాణ్ నామినేషన్ ర్యాలీ తొలుత గొల్లప్రోలు పట్టణం వద్ద జాతీయ రహదారిపైన మొదలవుతుంది. గొల్లప్రోలు తాహసిల్లార్ కూడలి, సూరీడు చెరువు, పిఠాపురం దూళ్ల సంత, చర్చి సెంటర్, పిఠాపురం బస్టాండ్, ఉప్పాడ బస్టాండ్, గవర్నమెంట్ హాస్పిటల్, పోలీస్ స్టేషన్ రోడ్డు మీదుగా పాదగయ క్షేత్రం వద్ద ర్యాలీ ముగుస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పవన్ తన నామినేషన్ ను దాఖలు చేస్తారు.
Next Story

