Thu Mar 19 2026 12:02:13 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : రేపు మంగళగిరిలో ఓటు వేసి.. తర్వాత పిఠాపురానికి
రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు

రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆయనకు మంగళగిరిలో ఓటు ఉండటంతో అక్కడ ఓటు హక్కను వినియోగించుకుని తర్వాత ఆయన పిఠాపరం నియోజకవర్గానికి బయలుదేరి వెళతారు. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
పోలింగ్ సరళిపై...
ఉదయాన్నే మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకుని ఆ తర్వాత ఆయన పిఠాపురం వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పిఠాపురం వెళ్లి అక్కడ పోలింగ్ సరళిని పరిశీలించనున్నారు. ఈరోజు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

