Sat Mar 07 2026 21:55:29 GMT+0530 (India Standard Time)
రేపు బెజవాడకు పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు విజయవాడకు రానున్నారు. మంగళగిరిలో జరగనున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు విజయవాడకు రానున్నారు. మంగళగిరిలో జరగనున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అద్యక్షులు, కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్ఛార్జులు, వీరమహిళ సమన్వయ కర్తలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, సంయుక్త కార్యదర్శులు హాజరు కావాలని కోరారు.
టీడీపీతో పొత్తుపై...
ఈ సమావేశంలో ఏ పరిస్థితుల్లో తాను తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని పవన్ వివరించనున్నారు. భవిష్యత్ లో కలసి రెండు పార్టీలూ కలసి పనిచేయాలని నేతలకు పిలుపునివ్వనున్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. టీడీపీతో కలసి కార్యాచరణ రూపొందించుకుని కలసి ముందుకు వెళ్లాలని జనసేన నేతలకు పిలుపునివ్వనున్నారు. వైసీపీని గద్దె దించేందుకు రెండు పార్టీలతో కలసి బీజేపీని కూడా కలుపుకుని పోయేందుకు ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా పవన్ చెప్పనున్నారు.
Next Story

