Mon Jan 20 2025 06:59:55 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : నేడు పిఠాపురానికి పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు. ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొననున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు. ఆయన పిఠాపురంలో జనసేన ఆధ్వర్యంలో జరిగే ఉగాది వేడుకల్లో పాల్గొననున్నారు. కొత్తగా తీసుకున్న భవనంలో పవన్ కల్యాణ్ బస చేయనున్నారు. గొల్లప్రోలు మండలం, చేబ్రోలులో పార్టీ అభిమానికి చెందిన భవనాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసం, పార్టీ కార్యాలయానికి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఉగాది వేడుకలను...
ఈ భవనంలోనే పవన్ కల్యాణ్ బస చేయనున్నారు. తాను అధికారంలోకి వస్తే పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తానన్న విషయాన్ని పవన్ కల్యాణ్ నేడు ప్రకటించనున్నారు. పవన్ వస్తుండటంతో పెద్దయెత్తున అభిమానులు తరలించే అవకాశముంది. పవన్ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
Next Story