Tue Feb 07 2023 14:04:32 GMT+0000 (Coordinated Universal Time)
దుర్గగుడిలో వారాహి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుర్గగుడికి రానున్నారు. తన ప్రచారం రధం వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయనున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుర్గగుడికి రానున్నారు. అమ్మవారిని దర్శించుకోనున్నారు. తన ప్రచారం రధం వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. పవన్ కల్యాణ్ రాక సందర్భంగా విజయవాడ దుర్గ గుడి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కొందరికే అనుమతి....
సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా పవన్ కల్యాణ్ తో పాటు కొంతమందికి మాత్రమే ఆలయంలోకి అనుమతించనున్నారు. వారాహి వాహనానికి నిన్న కొండగట్టు ఆంజనేయస్వామి గుడిలో పూజలు చేసిన పవన్ కల్యాణ్ నేడు దుర్గగుడిలో పూజలు చేయించనున్నారు. ఆయన త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
Next Story