Mon Mar 16 2026 01:46:44 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : నేడు అమరావతికి పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు అమరావతికి రానున్నారు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు అమరావతికి రానున్నారు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. పొత్తులు ఖరారవుతున్న నేపథ్యంలో ఆయన పార్టీ కీలక నేతలతో సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే టీడీపీతో అధికారికంగా పొత్తును ప్రకటించిన పవన్ కల్యాణ్ బీజేపీని కూడా తమతో కలసి కూటమిలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.
సీట్ల పంపంకపై...
చంద్రబాబు కూడా అమిత్ షాను కలసి రావడంతో బీజీపీ కూడా కూటమిలో చేరేందుకు సిద్ధమయింది. అయితే సీట్ల పంపకంలో ఇప్పటికే పలు దఫాలుగా పవన్ కల్యాణ చంద్రబాబుతో చర్చలు జరిపారు. సీట్లు ఎన్ని? ఎక్కడ? అన్న దానిపై ఇద్దరి నేతలకు ఒక స్పష్టత వచ్చింది. అయితే బీజేపీతో పొత్తు ఖరారయిన తర్వాత సీట్ల విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
Next Story

