Sat Mar 21 2026 21:47:44 GMT+0530 (India Standard Time)
Perni nani : పవన్ వచ్చిపోయే ఖర్చు చూశారా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్ వేశారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్ వేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ వ్యవహారశైలిని అందరూ గమనిస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివి వెళుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన దుబారాను ఎందుకు పవన్ ప్రశ్నించలేకపోతున్నారని అన్నారు. పవన్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారన్న నాని వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో కూడా తెలియదన్నారు.
నిద్రలేచే సమయానికే...
మత్స్యకారులకు ప్రభుత్వం పవన్ నిద్రలేచే సమయానికే సాయాన్ని అందించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పవన్ మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికి యాభై వేలు ఇచ్చి వెళ్లారని, అయితే ఆయన ఛార్టర్ ఫ్లైట్ వచ్చి వెళ్లడానికి అంతకంటే ఎక్కువ ఖర్చు అయిఉంటుందని ఎద్దేవా చేశారు. పవన్ దగ్గర డబ్బులు లేకుంటే ప్రత్యేక విమానంలో ఎలా వస్తారని ప్రశ్నించారు. జగన్ మత్స్యకారులను వెంటనే ఆదుకున్న విషయాన్ని పవన్ గుర్తుంచుకుంటే మంచిదన్నారు.
Next Story

