Fri Jan 17 2025 21:09:11 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కు పాల్ మెగా ఆఫర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెయ్యి కోట్ల రూపాయల ఆఫర్ వచ్చారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెయ్యి కోట్ల రూపాయల ఆఫర్ వచ్చారు. పవన్ కల్యాణ్ తన పార్టీని వదిలి తన పార్టీలో చేరితే తాను ఎమ్మెల్యే, ఎంపీగానో గెలిపిస్తానని చెప్పారు. అలా గెలిపించకపోతే వెయ్యి కోట్ల రూపాయలను తాను పవన్ కు ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు.
గెలిపించకలేకపోతే....
పవన్ సొంతంగా పోటీ చేసినా, పొత్తులు కుదుర్చుకుని పోటీ చేసినా గెలవలేరని, తన పార్టీలో చేరితేనే పవన్ కు గెలుపు సాధ్యమవుతుందని కేఏపాల్ తెలిపారు. పొత్తులపై పవన్ బైబిల్ గురించి మాట్లాడటం ఆశ్చర్యాన్ని కల్గించిందన్నారు. పవన్ ఎప్పుడైనా తనను సంప్రదించి తన పార్టీలో చేరవచ్చనని కేఏ పాల్ తెలిపారు.
Next Story