Wed Jan 22 2025 14:23:24 GMT+0000 (Coordinated Universal Time)
క్రాప్ హాలిడే పాపం వైసీపీదే
కోనసీమ క్రాప్ హాలిడే పాపం వైసీపీ ప్రభుత్వానిదేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
కోనసీమ క్రాప్ హాలిడే పాపం వైసీపీ ప్రభుత్వానిదేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇవ్వలేదని పేర్కొన్నారు. రైతులకు 475 కోట్ల రూపాయలు బకాయిలు ఇంకా చెల్లించలేదని, ఈ పరిస్థితుల్లో రైతులు ఇంకా ఏం చేస్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
అండగా ఉంటాం....
ప్రతి విషయాన్ని వైసీపీ ప్రభుత్వం ఇతరుల మీదకు నెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. తాము చేసిన పాపాన్ని ఇతరులకు అంటగట్టే ప్రయత్నం వైసీపీ ఎప్పుడూ చేస్తుందన్నారు. రైతుల పక్షాన జనసేన పోరాడుతుందని, ప్రభుత్వం దిగి వచ్చే వరకూ ఆందోళన చేస్తామని ఆయన అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Next Story