Sun Mar 15 2026 15:02:22 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : నేడు పిఠాపురంలో పవన్ రోడ్ షో
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ప్రచారంలో పాల్గొంటున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ప్రచారంలో పాల్గొంటున్నారు. పిఠాపురంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే రోడ్ షో ప్రారంభమవుతుందని మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్విఎస్ వర్మ తెలిపారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రోడ్ షో జరగనుంది.
ఆరు గంటల పాటు...
చెందుర్తిలో రోడ్ షో ప్రారంభమవుతుంది. తర్వాత రోడ్ షో వన్నెపూడి, కొడవలి, వెల్దర్తి, దొంతమూరు, బి.కొత్తూరు, పి. తిమ్మాపురం, గోకివాడ, జాములపల్లి, నరసింగాపురం, ఎల్.ఎన్.పురం, కొలంక, విరవాడ, విరవ, మంగితుర్తి, మల్లం, జల్లూరు, ఎఫ్‌కే పాలెం, కంద్రాడ మమీదుగా కుమారపురం వరకూ రోడ్ షో జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పవన్ రోడ్ షోకు జనం భారీగా తరలి వచ్చే అవకాశముంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Next Story

