Fri Mar 20 2026 12:17:40 GMT+0530 (India Standard Time)
ఏపీని 25 రాష్ట్రాలు చేయండి... పవన్ ట్వీట్
జనసేన అధినేత పవన్ కల్యాన్ ట్వీట్లతో వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. రెండు రోజుల నుంచి వరస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాన్ ట్వీట్లతోనే వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. రెండు రోజుల నుంచి వరస ట్వీట్లతో వైసీపీ ప్రభుత్వంపై మండి పడుతున్నారు. సెటైర్లు వేస్తున్నారు. మంత్రులు పవన్ ట్వీట్లకు కౌంటర్ ఇస్తున్నా పవన్ మాత్రం తాను అనుకున్నది అనుకున్నట్లు ట్విట్టర్ లో పోస్టు చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ను యునైటెడ్ స్టేట్స్ ఆఫ ఆంధ్ర అంటూ పవన్ ట్వీట్ చేశారు. వికేంద్రీకరణే అభివృద్ధి మంత్రం అనుకుంటే 25 జిల్లాలను 25 రాష్ట్రాలుగా ప్రకటించాలని కోరారు.
ఏమాత్రం సంకోచించొద్దు...
25 రాజధానులను ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీని వైసీపీ రాజ్యంగా మార్చుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఏమాత్రం సంకోచించకండి అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. వైసీపీకి చట్టం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి అతీతంగా ఉన్నట్లు విశ్విస్తారని, ప్రవర్తిస్తారని, మిగిలిన ప్రజలు ఏం భావిస్తున్నారో లేదా చెప్పేదానిని వారు ఒక పైసా కూడా పట్టించుకోరని అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
Next Story

