Fri Mar 20 2026 20:37:25 GMT+0530 (India Standard Time)
అంతా వాడి ఇష్టం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై సెటైర్ వేశారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై సెటైర్ వేశారు. ఆయన ఇటీవల కాలంలో కార్టూన్లతో ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మద్యనిషేధంపై ఆయన కార్టూన్ సెటైర్ గా ట్వీట్ చేశారు. మద్య నిషేధాన్ని అమలులోకి తెస్తానని జగన్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తన మ్యానిఫేస్టోలో కూడా మద్యనిషేధం అమలును ప్రస్తావించారు. కానీ గత కొద్ది రోజులుగా ఏపీ లో బార్ల లైెసెన్సులకు వేలం జరుగుతుంది.
కార్టూన్...
ఈ వేలంలో కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి అందుతున్న సంగతి తెలిసిందే. మొన్న ఉత్తరాంధ్ర, రాయలసీమ బార్ల వేలం ద్వారా దాదాపు 248 కోట్ల రూాపాయల ఆదాయం లభించింది. దీనిపై పవన కల్యాణ్ "మద్యం, మిథ్య... నిషేధం మిధ్య.. తాగమని, తాగొద్దనడానికి మనవెవరం.. అంతా వాడి ఇష్టం" అనే కాప్షన్ తో కార్టూన్ ను ట్వీట్ చేశారు. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది.
Next Story

