Sun Mar 15 2026 20:37:42 GMT+0530 (India Standard Time)
కందుకూరు ఘటనపై పవన్ దిగ్భ్రాంతి
నెల్లూరు జిల్లా కందుకూరు లో జరిగిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

నెల్లూరు జిల్లా కందుకూరు లో జరిగిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేది కార్యకర్తలేనని పవన్ అభిప్రాయపడ్డారు. రోడ్ షో లో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు మరణించడం దురదృష్టకరమని పవన్ కల్యాణ్ అన్నారు.
క్షతగాత్రులు కోలుకోవాలని...
అనేక మందికి గాయాలపాలయ్యారని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఇది విచారకరమైన సంఘటన అని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా రాజకీయ పార్టీలు, పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story

