Wed Dec 24 2025 03:05:26 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు ఆరోగ్యంపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయమని ఆయన అన్నారు. ఆరోగ్య సమస్యలపై మానవతా థృక్పధంతో వ్యవహరించాలని కోరారు.
నిర్లక్ష్యం తగదు...
చంద్రబాబు ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష ధోరణి సరికాదని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని ఆయన జైలు అధికారులను డిమాండ్ చేశారు. చంద్రబాబు అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Next Story

