Wed Mar 18 2026 13:08:37 GMT+0530 (India Standard Time)
Breaking : నిడదవోలు అభ్యర్థిగా కందుల దుర్గేష్
నిడదవోలు అసెంబ్లీ నియోజవకర్గం అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను ప్రకటిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు

నిడదవోలు అసెంబ్లీ నియోజవకర్గం అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను ప్రకటిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ నుంచి అధికారిక ప్రకటన విడుదలయింది. నిడదవోలు జనసేన అభ్యర్థిగా మాత్రమే కాకుండా కందుల దుర్గేష్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా కందుల దుర్గేష్ ఉన్నారు.
పొత్తులో భాగంగా...
కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే అక్కడ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉండటంతో పాటు బీజేపీతో పొత్తు కుదరడం వల్ల కూడా కందుల దుర్గేష్ ను నిడదవోలు నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేయించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తారన్న ప్రచారం గత కొంతకాలంగా సాగుతుంది. మొత్తం 24 అసెంబ్లీలో పోటీ చేయనున్న జనసేన తొలి విడతగా ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా ఆరో అభ్యర్థిని ఇప్పుడు ప్రకటించినట్లయింది.
Next Story

