Thu Mar 19 2026 08:50:35 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : కాకినాడ ఎంపీ సీటును ప్రకటించిన పవన్
కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు

కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాకినాడ పార్లమెంటు సభ్యుడిగా జనసేన పార్టీ నుంచి ఉదయ్ పోటీ చేయనున్నారని ఆయన తెలిపారు. తన కోసం ఆయన సీటును త్యాగం చేసిన ఉదయ్ కు కాకినాడ పార్లమెంటు సీటును ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
పొత్తులో భాగంగా...
కాకినాడ ఎంపీగా ఉదయ్ పోటీ చేస్తారని ఆయన తెలిపారు. కాకినాడ ఎంపీ సీటు పొత్తుల్లో భాగంగా జనసేనదేనని ఆయన చెప్పుకొచ్చారు. ఉదయ్ ఈ స్థానం నుంచి పోటీ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న నమ్మకం తనకుందని ఆయన అన్నారు. ఉదయ్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు.
Next Story

