Thu Mar 19 2026 07:22:14 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : మంగళగిరిలో ఓటు వేసిన పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఆయన ఓటు వేశారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఆయన ఓటు వేశారు. తన సతీమణితో కలసి వచ్చిన పవన్ కల్యాణ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పవన్ కల్యాణ్ పోలింగ్ కేంద్రానికి వస్తున్నారని తెలిసి ఆయన అభిమానులు ముందుగానే అక్కడకు చేరుకున్నారు.
పిఠాపురానికి పవన్...
సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. పవన్ కల్యాణ్ పోలింగ్ కేంద్రంలోకి పంపడానికే పోలీసులకు కష్టమయిపోయింది. పోలీసులు పవన్ అభిమానులు చెదరగొట్టారు. దీంతో ఆయన తన సతీమణితో కలసి మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్ లో నిలబడి తన ఓటును వేసిన పవన్ కల్యాణ్ కాసేపట్లో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి బయలుదేరారు.
Next Story

