Mon Mar 16 2026 20:25:38 GMT+0530 (India Standard Time)
పవన్ మోదీకి శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు

ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. మన్ కీ బాత్' కార్యక్రమం వంద ఎపిసోడ్లు పూర్తి సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రధాని రేడియో ద్వారా ముచ్చటించే కార్యక్రమం ప్రజలకు చేరువైందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
మన్ కీ బాత్....
సామాన్యుల విజయాలను ప్రస్తావిస్తూ ఎంతో మందికి ఈ కార్యక్రమం స్ఫూర్తి కలిగిస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ‘మన్ కీ బాత్' నిరాటంకంగా కొనసాగాలని కోరుకుంటున్నానని పవన్ ఆకాంక్షించారు. ప్రధానితో పాటు కార్యక్రమ నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు.
Next Story

