Wed Mar 18 2026 20:04:14 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : పిఠాపురం నుంచి హైదరాబాద్ వెళ్లిన పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు పిఠాపురం పర్యటనకు బ్రేక్ ఇచ్చారు. ఆయన హైదరాబాద్ కు వెళ్లిపోయారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు పిఠాపురం పర్యటనకు బ్రేక్ ఇచ్చారు. ఆయన హైదరాబాద్ కు వెళ్లిపోయారు. పవన్ గత రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. పిఠాపురంలో నాలుగు రోజుల పాటు పర్యటించాలని ఈ నెల 30వ తేదీన బయలుదేరి వెళ్లిన పవన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో...
వెంటనే వాయిదా వేయడం మంచిది కాదని భావించి పంటి బిగువున రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిన్న శక్తిపీఠాన్ని సందర్శించుకున్న అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈరోజు మళ్లీ పిఠాపురం వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అత్యవసర సమావేశం కోసం ఆయన బయలుదేరి హైదరాబాద్ వెళ్లారని పార్టీ నేతలు చెబుతున్నారు.
Next Story

