Sat Dec 06 2025 00:05:20 GMT+0000 (Coordinated Universal Time)
మోదీని కలిసిన పవన్ కల్యాణ్...చిరంజీవి ఇంట్లో...ఫుల్ ఫొటోస్
ప్రధానమంత్రి నరేంద్రమోదీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా కలిశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ తన తనయుడు అకీరా నందన్‌ను మోదీకి పరిచయం చేశారు. అకీరా భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం. నిన్న సాయంత్రం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. మోదీ నివాసంలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
చిరంజీవి ఇంట్లో...
మోదీని ముచ్చటగా మూడోసారి ఎన్డీయే సారథిగా భాగస్వామ్య పక్షాల నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9వ తేదీన మోదీ, కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులతో కలసి చిరంజీవి ఇంటికి వచ్చారు. వారి ఇంట్లో సంబరాలు చేసుకున్నారు.
పవన్ కల్యాణ్ తన తల్లి, వదిన, అన్నలకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాలకు కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు.
Next Story

