Sat Mar 14 2026 14:13:26 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : గిరిజనుల మధ్య పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటిస్తున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఓనూరు జలజీవన్ మిషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన నీటి కుళాయిని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అక్కడ సరఫరా అవుతున్న నీటిని పవన్ కల్యాణ్ పరిశీలించారు. అనంతరం అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించి వారికి బ్యాగులను అందచేశారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని...
గర్భిణులకు పౌష్టికాహారాన్నిఅందచేశారు. అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని గిరిజనుల మధ్య జరుపుకున్నారు. పాడేరు నియోజకవర్గంలో నందిగరువలో జరిగే కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.అంతకు ముందు ఓనూరు జంక్షన్ వద్ద తొలుత పవన్ కల్యాణ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
Next Story

